ర‌మ‌ణా.. మాస్ మ‌హ‌రాజా సినిమా వ‌స్తోందిరా!


Anil Ravipudi dialogue goes viral
Anil Ravipudi dialogue goes viral

ర‌మ‌ణా లోడెత్తాలిరా… చెక్‌పోస్ట్ ప‌డిపోద్దీ…మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలోని ఈ డైలాగ్ సినిమా రిలీజ్ అయిన ద‌గ్గ‌రి నుంచి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రాజీవ్ క‌న‌కాల‌ని బంధించిన న‌ల్ల‌మ‌ల అడ‌వుల నుంచి మ‌హేష్ తీసుకొచ్చే సంద‌ర్భంలో వ‌చ్చే సీన్ ఇది. ఓ ఫైట‌ర్‌తో చెప్పించిన ఈ డైలాగ్ ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. తాజాగా మ‌రోసారి ఇదే డైలాగ్‌ని అనిల్ రావిపూడి ప‌ల‌క‌డం వైర‌ల్‌గా మారింది.

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న రెట్రో థ్రిల్ల‌ర్ `డిస్కోరాజా`. వి.ఐ.ఆనంద్ తెర‌కెక్కిస్తున్నారు. పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్ హీరోయిన్‌గాలుగా న‌టిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ప్రీరిలీజ్ వేడుక‌ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనిల్ రావిపూడి తైదైన స్టైల్లో చిత్ర బృందాన్నిఎంట‌ర్‌టైన్ చేశారు.

`సంక్రాంతి పండ‌క్కి బాక్సాఫీస్ ద‌ద్ద‌రిల్లిపోతోంది. డ‌బ్బులు లోడు ఎత్తుతూనే వున్నారు. జ‌న‌వ‌రి 24న మాస్ రాజా ర‌వితేజ వ‌స్తున్నారు. ర‌మ‌ణా…మాస్ మ‌హారాజ్ సినిమా వ‌స్తోందిరా.. లోడెత్తాలా.. `అంటూ అనిల్ రావిపూడి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆయ‌న‌ ఈ డైలాగ్ చెప్ప‌గానే ప్రేక్ష‌కుల‌తో పాటు హీరో ర‌వితేజ కూడా న‌వ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.