అనిల్ రావిపూడి భ‌లే స్పీడుమీదున్నాడే!

అనిల్ రావిపూడి భ‌లే స్పీడుమీదున్నాడే!
అనిల్ రావిపూడి భ‌లే స్పీడుమీదున్నాడే!

స్టార్‌ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాంచి స్పీడుమీదున్నాడు. గ‌త ఏడాది ప్రారంభంలో `ఎఫ్ 2 `తో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ ఎన‌ర్జిటిక్ డైరెక్ట‌ర్ ఈ ఏడాది ప్రారంభంలో మ‌హేష్‌తో `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని అందించి స్టార్ డైరెక్ట‌ర్‌ల జాబితాలో చేరిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం `ఎఫ్‌2`కు  సీక్వెల్‌గా `ఎఫ్ ‌3` ని తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో వున్నారు.

విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ మ‌రోసారి క‌లిసి న‌టించ‌నున్న ఈ మూవీ ఈ నెల రెండ‌వ వారంలో ప్రారంభం కాబోతోంది. అయితే ఇటీవ‌ల పారితోషికాల స‌మ‌స్య కార‌ణంగా ఈ మూవీ ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపించింది. ఆ స‌మ‌స్య‌ని తెలివిగా అధిగ‌మించిన దిల్ రాజు ఈ సీక్వెల్‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ కి పూజా కార్య‌క్ర‌మాల్ని ఈ రోజు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కుటుంబ స‌మేతంగా నిర్వ‌హించారు.

పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల నుంచే స్టార్ట్ అవుతుంద‌ని వెల్ల‌డించారు. `ఎఫ్‌3` స్క్రిప్ట్‌ని అనిల్‌తో పాటు త‌ని టీమ్ రైట‌ర్స్ కంప్లీట్ చేశార‌ట‌. బౌండ్ స్క్రిప్ట్‌తో అనిల్ సెట్స్‌కి వెళుతున్న‌ట్టు తెలుస్తోంది. దేవిశ్రీ‌ప్ర‌సాద్ ఈ సీక్వెల్‌కి సంగీతం అందించ‌బోతున్నారు.