అనిల్ రావిపూడి డ్రీమ్‌ నిజ‌మౌతోంది!

అనిల్ రావిపూడి డ్రీమ్‌ నిజ‌మౌతోంది!
అనిల్ రావిపూడి డ్రీమ్‌ నిజ‌మౌతోంది!

గత రెండు సంవత్సరాలుగా బాలకృష్ణని డైరెక్ట్ చేయాల‌ని దర్శకుడు అనిల్ రావిపూడి కల. గతంలో `రామరావు గారు` అనే కథను బాలయ్యకు వినిపించాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాల్సి ఉంది. ఏదేమైనా అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అనిల్ రావిపూడి ఇటీవల బాలయ్యకు స్క్రిప్ట్‌ను వినిపించాడని, క‌థ న‌చ్చ‌డంతో బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్  ఇచ్చాడ‌ని ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి రానుంద‌ని తెలిసింది. దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న డ్రీమ్ నెరవేర‌బోతుండ‌టంతో అనిల్ ఆనందంతో పొంగిపోతున్నార‌ట‌. అయితే అనిల్ కొన్ని మార్పులతో `రామారావు గారు` స్క్రిప్ట్‌ను చెప్పాడా?  లేదా కొత్త క‌థ‌ని విపించాడా? అన్న‌ది మాత్రం తెలియాల్సి వుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్ట్‌ని దిల్ రాజు కాకుండా హరీష్ పెద్ది, సాహు గారపాటి షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించ‌నున్నారట‌. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి `ఎఫ్ 3` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. అనిల్ రావిపూడికి క‌రోనా పాజిటివ్ అని తేలిన కార‌ణంగా `ఎఫ్‌3` మైసూర్ షెడ్యూల్‌ని వాయిదా వేశారు.