స్క్రిప్ట్ ఫైన‌ల్ చేసిన డైరెక్ట‌ర్‌! 

స్క్రిప్ట్ ఫైన‌ల్ చేసిన డైరెక్ట‌ర్‌!
స్క్రిప్ట్ ఫైన‌ల్ చేసిన డైరెక్ట‌ర్‌!

క‌రోనా కార‌ణంగా ల‌క్‌డౌన్ విధించ‌డంతో ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోయారు. జ‌న‌జీవితం స్థంభించిపోయింది. ప్ర‌తీ రంగంలాగే సినిమా రంగం కూడా షూటింగ్‌ల‌ని ఆపేసింది. అంతా ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. అయితే ఇంటికే ప‌రిమితం అయిన కొంత మంది వెరైటీ వంట‌కాల‌తో కాల‌క్షేపం చేస్తుంటే విలువైన స‌మ‌యాన్ని మాత్రం కొంత మంది బాగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు.

అనిల్ రావిపూడి కూడా ఈ స‌మ‌యాన్ని కొత్త స్క్రిప్ట్‌ని పూర్తి చేయ‌డానికి వినియోగించాడ‌ట. గ‌త ఏడాది సంక్రాంతికి `ఎఫ్ 2 ` సినిమాతో ఫ‌న్‌ని, ఫ్ర‌స్ట్రేష‌న్‌ని చూపించి ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేశారు. విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ తొలిసారి క‌లిసి న‌టించిన `ఎఫ్‌2` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి దాదాపు 100 కోట్లు వ‌సూలు చేసింది. ఇదే ఊపుతో `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా మ‌లిచిన అనిల్ రావిపూడి `ఎఫ్‌2`కు సీక్వెల్‌గా `ఎఫ్‌3`ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ని లాక్‌డౌన్ పిరియెడ్‌లో పూర్తి చేశార‌ట‌. లాక్‌డౌన్ త‌రువాత ప‌రిస్థితుల‌ని బ‌ట్టి సీక్వెల్‌ని దే త‌రాగ‌ణంతో స‌రికొత్త మ‌లుపుల‌తో తెర‌పైకి తీసుకురాబోతున్న‌ట్టు తెలిసింది. ఈ సీక్వెల్‌కు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్న‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.