పాయల్ రాజ్ పుత్ ను మర్చిపోయిన ఆ దర్శకుడు


Anil Ravipudi Forgot Heroine Name
Anil Ravipudi Forgot Heroine Name

మనం ఉన్న పరిస్థితిని బట్టి మనకి అన్ని గుర్తు ఉండాలి అన్నరూల్ లేదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు చాలామంది మనల్ని కలుస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా డైరెక్టర్ లాంటి బాధ్యతలు నిర్వర్తించే వారిని రోజుకి కనీసం యాభై నుంచి వంద మంది కొత్త వ్యక్తులు కలిసి వెళ్తారు. అలాంటప్పుడు అందరి పేర్లు గుర్తు పెట్టుకోవాలి.! అంటే కష్టం కదా. కానీ ఎవరి పేరైనా మర్చిపోవచ్చు కానీ, ఆల్రెడీ హిట్టయిన హీరోయిన్ పేరు మర్చిపోవడం అంటే ఆ నటి ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యా ఛాన్స్ ఉంది.

మాస్ మహరాజ్ రవితేజ కథానాయకుడిగా నటించిన డిస్కో రాజా సినిమా రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి సంఘటన జరిగింది. ఇప్పటికే రవితేజతో “రాజా ది గ్రేట్” అనే సూపర్ హిట్ సినిమా ఇచ్చిన అనిల్ రావిపూడి ఒకానొక అతిథిగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేశాడు. ఎప్పటిలాగే తనదైన హుషారెత్తించే స్పీచ్ తో రవితేజ గొప్పతనం గురించి చెప్తూ, ఉన్నట్లుండి ఆ సినిమాలో పనిచేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పేరు మర్చిపోయాడు. పక్కనే ఉన్న మరొక దర్శకుడు గోపీచంద్ మలినేని ఆయనకు పాయల్ రాజ్ పుత్ పేరు చెప్పగా కంగారులో చెప్పేసి, మరొక హీరోయిన్ నభా నటేష్ ని మాత్రం రైసింగ్ హీరోయిన్ అంటూ పొగిడేశాడు.

అయితే ఈ విషయం పట్ల కొంత మంది నెటిజన్లు, ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ ఫ్యాన్స్ హార్ట్ అయి “అనిల్ సార్..! వాట్ ఇస్ దిస్ అండి.? అని సోషల్ మీడియాలో బాధపడుతున్నారు. నభా నటేష్ కంటే ముందే ఇండస్ట్రీలో “ఆర్ఎక్స్ 100” లాంటి సూపర్ హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ని మర్చిపోవడం అంటే కొంచెం ఇబ్బందే. ఎందుకంటే నిజాలు మాట్లాడుకుంటే ఆ సినిమా హిట్ అయింది అంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మీద.

అనిల్ సార్ అయినా, సినిమా రిలీజ్ టైం లో అయితే.. కొంచెం టెన్షన్ లో ఉంటాడు.! కాబట్టి పేర్లు మర్చి పోయిన పర్వాలేదు; ఆల్రెడీ అయిన సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ కూడా అయింది. సక్సెస్ మూడ్ లో ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ పేరు మర్చిపోవడం ఏంటి.? అని కొంతమంది క్రిటిక్స్ ఈ అంశాన్ని ఇష్యూ కూడా చేస్తున్నాడు.