అనిల్ రావిపూడి మహేష్ బాబు తో


 Anil ravipudi next with Mahesh babu ?

సూపర్ స్టార్ మహేష్ బాబు తో అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఉండనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి . అయితే ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మహేష్ బాబు మహర్షి సినిమా కంప్లీట్ చేయాలి తర్వాత సుకుమార్ సినిమా చేయాలి అప్పుడు కానీ అనిల్ తో కానీ మరో దర్శకుడితో కానీ సినిమా కుదరదు . అంటే 2020 తర్వాతే ! అన్నమాట .

మహేష్ బాబు నటించిన ఆగడు చిత్రానికి అనిల్ రావిపూడి పని చేసాడు కాకపోతే స్క్రిప్ట్ వర్క్ చేసాడు . ఆ సినిమా డిజాస్టర్ కానీ అనిల్ రావిపూడి తో మహేష్ కు అప్పటిదే పరిచయం . ఆ పరిచయం తో అనిల్ సాధిస్తున్న సక్సెస్ కు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించాడట . ఇంకేముంది ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటూ ప్రచారం సాగుతోంది . మహేష్ బాబు తో సినిమా చేయాలనీ అనిల్ రావిపూడి కి ఉంది కానీ అన్నీ కుదరాలి కదా ! కథ సెట్ అవ్వాలి , మహేష్ డేట్స్ ఖాళీ అవ్వాలి అప్పుడు ఈ కాంబినేషన్ లో సినిమా .

English Title: Anil ravipudi next with Mahesh babu ?