ఎక్స్‌క్లూసివ్‌: క‌ల్యాణ్‌ రామ్ సినిమాని స్క్రాప్ అన్నారా?


ఎక్స్‌క్లూసివ్‌: క‌ల్యాణ్‌రామ్ సినిమాని స్క్రాప్ అన్నారా?
ఎక్స్‌క్లూసివ్‌: క‌ల్యాణ్‌రామ్ సినిమాని స్క్రాప్ అన్నారా?

గోపీచంద్ న‌టించిన `శౌర్యం`, శంఖం, రామ్ న‌టించిన `కందిరీగ‌`(స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్‌), ర‌వితేజ న‌టించిన `ద‌రువు`, అల్ల‌రి న‌రేష్ న‌టించిన `సుడిగాడు`, రామ్‌, వెంకీ న‌టించిన `మ‌సాలా`, మ‌హేష్ న‌టించిన `ఆగ‌డు` (స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్‌), రామ్ `పండ‌గ చేసుకో` వంటి చిత్రాల‌కు డైలాగ్ రైట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి `ప‌టాస్‌` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన విష‌యం తెలిసిందే. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ న‌టించి నిర్మించిన ఈ చిత్రం 2015లో విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది.

అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఈ చిత్రాన్ని చూసిన కొంత మంది ఇది సినిమానా అంతా స్క్రాస్‌లా వుంద‌ని ఎగ‌తాళి చేశార‌ట‌. పెన్ను పేప‌రు ప‌ట్టుకొచ్చాడు వీడు రైట‌ర్ అంట‌..ద‌క్శ‌కుడు అయిపోతాడంట‌. అని దారుణంగా అవ‌మానించార‌ట‌. ఈ విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టిన అనిల్ రావిపూడి భావోద్వేగానికి గురికావ‌డం షాక్‌కు గురిచేస్తోంది.

యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `నీకు మాత్ర‌మే చెప్తా` టాక్ షో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ షోకి తొలి గెస్ట్‌గా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడిని ఆహ్వానించారు. తాజాగా ఈ షోకు సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో అనిల్ వెల్ల‌డించిన విష‌యాలు హాట్ టాపిక్‌గా మార‌బోతున్నాయి. ఈ నెల 14న అనిల్ రావిపూడికి సంబంధించిన ఎపిసోడ్ ఈటీవీ ప్ల‌స్‌లో ప్లే కాబోతోంది. టీజ‌ర్‌లోనే ఆ రేంజ్‌లో వుంటే పూర్తి స్థాయి టాక్ షోలో అనిల్ ఎలాంటి విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టాడో చూడాలి.