రావిపూడి చేతిలోనే అంతా ఉంది

రావిపూడి చేతిలోనే అంతా ఉంది
రావిపూడి చేతిలోనే అంతా ఉంది

సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమాపై దృష్టి నిలిపిన సంగతి తెల్సిందే. ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తుండగా తమన్నా, మెహ్రీన్ లు కథానాయికలు. ఇదిలా ఉంటే ఎఫ్ 3 చిత్రాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేద్దామని భావించాడు అనిల్ రావిపూడి.

సాధారణంగా ఈ దర్శకుడు చాలా ఫాస్ట్ గా తన సినిమాలను పూర్తి చేస్తాడు. అయితే ఎఫ్3 విషయంలోనే తన పప్పులు ఉడకలేదు. కరోనా సెకండ్ వేవ్ రావిపూడి ఆశలపై నీళ్లు చల్లింది. ఎఫ్3 షూటింగ్ ఆగిపోయి రెండు నెలలు అయింది. రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసారు.

వచ్చే నెల నుండి కొత్త షెడ్యూల్ ను మొదలుపెడదామనుకుంటున్నాడు. వెంకటేష్ రెడీగానే ఉన్నాడు. వరుణ్ తేజ్ కూడా కొద్ది రోజులు గ్యాప్ ఇస్తే గని షూటింగ్ ను పూర్తి చేసేస్తాడు. ఇక మెహ్రీన్ అయితే ఎఫ్3 ను పూర్తి చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. మరి దీనికి తగ్గట్లు అంతా జరుగుతుందా?