`గాలి సంప‌త్‌`కు అన్నీ అనిల్ రావిపూడినే?

`గాలి సంప‌త్‌`కు అన్నీ అనిల్ రావిపూడినే?
`గాలి సంప‌త్‌`కు అన్నీ అనిల్ రావిపూడినే?

శ్రీ‌విష్ణు హీరోగా న‌టిస్తున్న చిత్రం `గాలి సంప‌త్‌`. డా. రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. అనీష్ కృష్ణ ద‌ర్శ‌‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మిత్రుడు ఎస్‌.కృష్ణ నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రానికి అనిల్‌రావిపూడి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూనే స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ షూటింగ్‌ మొద‌లైంది.

అయితే ఈ మూవీకి అనిల్ రావిపూడి మ‌రో బాధ్య‌త‌ను కూడా తీసుకున్నారు. తాజాగా ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. `తొలుత ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూనే స్క్రీన్‌ప్లే అందించాల‌నుకున్నాను. కానీ ఈ మూవీ నాకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది కావ‌డంతో అద‌న‌పు బాధ్య‌త‌ల్పి కూడా చేప‌ట్టాను. అదే ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌. టీమ్ వ‌ర్క్‌ని న‌మ్ముతాను` అంటూ ఓ వీడియోని రిలీ్ చేశారు.

దీంతో `గాలి సంప‌త్‌` చిత్రానికి అనిష్ కృష్ణ కేవ‌లం పేరుకు మాత్ర‌మే ద‌ర్శ‌‌కుడ‌ని, మొత్తం అనిల్ రావిపూడినే చూసుకుంటున్నారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఫిల్మ్ `ఎఫ్‌2`కి సీక్వెల్ గా రూపొందుతున్న `ఎఫ్‌3`ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.