మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కు కోవిడ్ పాజిటివ్‌!

మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కు కోవిడ్ పాజిటివ్‌!
మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కు కోవిడ్ పాజిటివ్‌!

ఇటీవ‌ల స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకుంటున్నారు. ఇదిలా వుంటే మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ కోవిడ్ బారిన ప‌డ్డారు. ఆయ‌నే అనిల్ రావిపూడి.  బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `ఎఫ్ 2`కి సీక్వెల్‌గా ఆయ‌న `ఎఫ్‌3`ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.  ఈ చిత్రం ఫ్రెష్ షెడ్యూల్ ఇటీవల మైసూర్‌లో ప్రారంభమైంది.

అయితే తాజాగా అనిల్ రావిపూడికి COVID-19 పాజిటివ్ అని తేల‌డంతో ఈ షెడ్యూల్‌ని ర‌ద్దు చేశారు. ఇటీవ‌ల చేసిన టెస్టుల్లో అనిల్‌కు పాజిటివ్ అని తేల‌డంతో మైసూర్ షెడ్యూల్‌ని రద్దు చేశార‌ట‌. ఉగాది రోజు `ఎఫ్‌3` కొత్త షెడ్యూల్ ప్రారంభాన్ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించిన అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం కోవిడ్ సోక‌డంతో  స్వీయ నిర్భంధంలోకి వెళ్లార‌ట‌.

ఫిల్మ్ యూనిట్ వాస్తవానికి మైసూర్‌లో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. వెంకటేష్ `దృశ్యం – 2` షూట్ పూర్తి చేయడంతో `ఎఫ్‌3` కోసం ఎక్కువ డేట్‌లు ఇచ్చార‌ట‌. అయితే తాజా పరిణామాలతో కొత్త షెడ్యూల్ రద్దు చేశార‌ని, దర్శకుడు కోలుకున్న తర్వాతే షూట్ తిరిగి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది.