ఆ పుకార్లు నిజమే !


anirudh out from ntr trivikrams film

అజ్ఞాతవాసి చిత్రం ఘోర పరాజయం పొందడంతో ఆ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ ని తన తదుపరి చిత్రానికి వద్దు అని ఎన్టీఆర్ చెప్పినట్లు త్రివిక్రమ్ అనిరుధ్ వైపే మొగ్గు చూపినట్లు చివరకు ఎన్టీఆర్ ఒత్తిడి వల్ల తమన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు పుకార్లు షికారు చేసాయి , అయితే ఈ విషయాలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చినప్పటికీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించడం ఖాయమని అన్నట్లుగా వార్తలు వచ్చాయి .

కట్ చేస్తే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల చిత్రానికి అనిరుధ్ ని మార్చేసి ఎస్ ఎస్ తమన్ ని తీసుకున్నారు అన్న విషయాన్ని అనిరుధ్ ట్వీట్ చేయడం ద్వారా స్పష్టం చేసాడు . అజ్ఞాతవాసి చిత్రం డిజాస్టర్ కావడంతో అనిరుధ్ కు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల సినిమాకు పనిచేసే అవకాశం మిస్ అయ్యింది . దాంతో అనిరుధ్ బయటకు బాగానే కనిపిస్తున్నప్పటికీ లోలోన మాత్రం బాధపడుతూనే ఉన్నాడట .