పెళ్ళికి సిద్దమైన హీరోయిన్


Anisha ambrose engagement with guna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించాలని ఆశపడింది పాపం …… పవన్ కళ్యాణ్ కూడా ఆ భామకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని అనుకున్నాడు కానీ కుదరలేదు చివరి నిమిషంలో ఆ భామని తప్పించి కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసారు . దాంతో అనిషా ఆంబ్రోస్ కి పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ మిస్ అయ్యింది . కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన నటించకుండానే సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్ళికి సిద్ధం అవుతోంది.

 

 

జక్క గుణ అనే వ్యక్తితో అనిషా ఆంబ్రోస్ వివాహ నిశ్చితార్థం జరిగింది . త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది ఈ భామ . పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ రాలేదు కానీ అరకొర సినిమాలు వచ్చాయి . అవి అంతగా ఆడలేదు దాంతో ఈ భామకు చాన్స్ లు లేకుండాపోయాయి . చేతిలో సినిమాలు లేవు కాబట్టి పెళ్ళికి సిద్ధమైపోయింది .

English Title: Anisha ambrose engagement with guna