పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇవ్వడంతో పెళ్లి చేసుకుంది


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు కట్ చేస్తే సర్దార్ గబ్బర్ సింగ్ లో నుండి తీసేసాడు . దాంతో ఇక లాభం లేదనుకున్న ఈ భామ తాజాగా పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది . ఇంతకీ పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చిన భామ ఎవరో తెలుసా …… ఇంకెవరు అనీషా ఆంబ్రోస్ . తెలుగులో నాలుగైదు చిత్రాల్లో నటించింది ఈ భామ .

అయితే హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు . దాంతో ఇటీవలే పెళ్లి చేసుకుంది . తనకు పెళ్లి అయినట్లుగా తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది , అయితే భర్త పేరు వివరాలు మాత్రం తెలియజేయలేదు ఈ భామ . అనీషా ఆంబ్రోస్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది .