ఈ భామ పెళ్లి చేసుకునేది ఆ హీరోనేనా ?


anjali
anjali

నేను పెళ్లి చేసుకునేది తమిళ అబ్బాయినే అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది హీరోయిన్ అంజలి . తెలుగమ్మాయి అయిన అంజలి కి తమిళంలో స్టార్ డం వచ్చింది . దాంతో ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిస్తోంది , ఇక అడపా దడపా తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తున్న ఈ భామ తమిళ హీరో జై తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే .

అయితే మధ్యలో ఏవో తేడాలు వచ్చాయి దాంతో మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే ప్రేమికులం కాదు అంటూ చెప్పుకొచ్చింది . ఇక జై కూడా అలాగే అన్నాడు . కట్ చేస్తే తాజాగా మీడియా ముందుకు వచ్చిన అంజలి నేను పెళ్లి చేసుకునేది తమిళ అబ్బాయినే అంటూ ఖరాకండిగా చెప్పేసింది . అంటే తమిళ హీరో జై నే పెళ్లి చేసుకుంటాను అని పరోక్షంగా చెప్పినట్లా ? అని చర్చ సాగుతోంది .