వెంకీ మూవీలో అంజ‌లి!

వెంకీ మూవీలో అంజ‌లి!
వెంకీ మూవీలో అంజ‌లి!

విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ క‌లిసి న‌టించిన హిలేరియ‌స్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎఫ్‌2`. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2019 సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అనూహ్య విజ‌యాన్ని సాధించి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా `ఎఫ్ 3` చిత్రాన్ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ ప్ర‌ధాన జంట‌లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ తాజా షెడ్యూల్ ఉగాది నుంచి మొద‌లైంది. ఈ చిత్రం `ఎఫ్‌2`కి మించి హిలేరియ‌స్‌గా వుంటుంద‌ని అనిల్ రావిపూడి ఇప్ప‌టికే చెప్పేశారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే మ‌రిన్ని కీల‌క పాత్ర‌ల‌ని ఈ మూవీ కోసం పెంచేశారు.

ఇటీవ‌ల `వ‌కీల్ సాబ్‌`లోని కీల‌క పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్న అంజ‌లి ఈ మూవీలో న‌టించ‌నుంద‌ని తెలిసింది. ఈ వారం నుంచే అంజ‌లి ఈ మూవీ సెట్‌లోకి ఎంట‌ర్ కాబోతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక అంజ‌లితో పాటు ఈ మూవీలో సునీల్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. సునీల్ కూడా ఇదే వారం `ఎఫ్‌3` షూట్‌ల‌తో పాల్గొంటున్న‌ట్టు చెబుతున్నారు. హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీని ఆగ‌స్టు 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల చేయ‌బోతున్నారు.