ఆ హీరోని ప్రేమించలేదంటున్న అంజలి

Anjali unhappy with jai జర్నీ చిత్రంలో జంటగా నటించి ప్రేక్షకుల నీరాజనాలను అందుకున్న జంట జై అంజలి .  ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని బోలెడు వార్తలు పుట్టుకొచ్చాయి . దానికి ఊతమిచ్చేలా అంజలి – జై లు ఎప్పటికప్పుడు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని వ్యక్తం చేస్తూ ప్రేమలో ఉన్నారన్న విషయాన్నీ కన్ఫర్మ్ చేసారు . అయితే ఎక్కడో తేడా కొట్టింది ఇక పెళ్లి కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో అంతా సైలెంట్ అయిపొయింది.

ఇక ఇప్పుడేమో ఏకంగా జై ని నేను ప్రేమించలేదు , మీడియాలో మాత్రమే వచ్చింది అంతకు మించి మామధ్య ఏది లేదు అంటూ బ్రేకప్ అయిన విషయాన్నీ చెబుతోంది . అంజలి జై ని ప్రేమించలేదు అని గట్టిగా చెబుతున్నప్పటికీ ఇద్దరూ ప్రేమించుకున్నారు అన్నది వాస్తవం , కాకపోతే అప్పటి ప్రేమ ఇప్పుడు లేదు అందుకే నేను జై ని ప్రేమించలేదు అని అంటోంది అంతే తేడా !

English Title: Anjali unhappy with jai