ఆ హీరోని రెచ్చగొట్టడానికే కిస్ చేసిందట


అంకిత లోఖండే అనే హాట్ భామ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని రెచ్చగొట్టడానికే తన కొత్త ప్రియుడికి అందరి ముందు లిప్స్ పై కిస్ చేసిందని అంటున్నారు . సుశాంత్ సింగ్ ని అంకిత ఎందుకు రెచ్చగొట్టడం ? అని అనుకుంటున్నారా ? అసలు సుశాంత్ సింగ్ మొదటి ప్రేయసి ఈ అంకిత లోఖండే . సుశాంత్ సింగ్ – అంకిత లోఖండే లు అమర ప్రేమికుల్లా తిరిగారు కానీ సుశాంత్ కు బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ దక్కగానే అంకిత తో విడిపోయాడు . దాంతో విక్కీ జైన్ అనే వ్యాపారవేత్త తో ప్రేమలో పడింది .

తాజాగా ముంబై లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో నాకు కాబోయే వాడు ఈ విక్కీ జైన్ అంటూ అతడి పెదాలపై కిస్ చేసి అందరినీ షాక్ కి గురిచేసింది అంకిత . సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి పొజీషన్ లో ఉన్నాడు దాంతో అతడ్ని ఉడికించడానికి ఇలా పబ్లిక్ లో విక్కీ జైన్ ని ముద్దాడి సవాల్ విసురుతోంది అంకిత లోఖండే .