సుశాంత్‌ని కుక్క బెల్ట్‌తో హ‌త్య చేశారు!సుశాంత్‌ని కుక్క బెల్ట్‌తో హ‌త్య చేశారు!
సుశాంత్‌ని కుక్క బెల్ట్‌తో హ‌త్య చేశారు!

బాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ సుశాంత్ మ‌ర‌ణం రోజుకో మ‌లుపు తిరుగుతోంది.  జూన్ 14న సుశాంత్ మ‌ర‌ణ వార్త బ‌య‌టికి వ‌చ్చిన ద‌గ్గ‌రి నుంచి నాట‌కీ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  కొంత మంది నెపోటిజ‌మ్ అని, బాలీవుడ్ మాఫియా అని విమ‌ర్శ‌లు చేశారు. కానీ తాజా ప‌రిణామాల నేప‌థ్యం చూస్తుంటే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం సుశాంత్ గార్ల్ ఫ్రెండ్ రియానే దీనంత‌టికి ప్ర‌ధాన సూత్ర‌ధారిగా క‌నిపిస్తోంది. తాజాగా సీబీఐ ఈ కేసుని టేక‌ప్ చేయ‌డంతో సంచ‌ల‌న విష‌యాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి వ‌స్తున్నాయి.

సుశాంత్ కేసుని సీబీఐకి బ‌ద‌లాయించ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన రియా త‌నే ప్ర‌ధాన సూత్ర‌ధారిని అన్న విష‌యాన్ని ఇండైరెక్ట్‌గా అంగీక‌రించిన‌ట్టయింది. ఈడీ ముందు హాజ‌రైన రియా, రియా కుటుంబం సుశాంత్ ని ఏ స్థాయిలో వాడుకున్నారో ప్ర‌పంచానికి తెలిసిపోయింది. సుశాంత్ డ‌బ్బుతో ముంబై ప‌రిస‌రాల్లో ఖ‌రీదైన బంగ్లా, స్థ‌లం, త‌న వ్య‌క్త‌గా కారు ఫైనాన్స్ క్లియ‌ర్ చేసిన‌ట్టుగా వెల్ల‌డైంది. ఇదిలా వుంటే సుశాంత్ మ‌ర‌ణంపై అత‌ని మాజీ అసిస్టెంట్‌ అంకిత్ ఆచార్య‌ చేసిన కామెంట్‌ క‌ల‌క‌లం రేపుతోంది.

సుశాంత్‌ని అత‌ని కుక్క బెల్ట్‌తో ఉరివేసి చంపార‌ని, అలా చేస్తేనే మెడ చుట్టూ వృత్తాకారంలో గుర్తులుంటాయ‌ని షాకింగ్ విష‌యం బ‌య‌ట‌పెట్టారు. సుశాంత్ మెడ పై అలాంటి గుర్తులే వున్నాయ‌ని అంకిత్ పేర్కొన్నారు. సుశాంత్ హ‌త్య కేసుని సీబీఐకి అప్ప‌గించ‌డం ప‌ట్ల అంకిత్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దోషుల‌కు ఉరిశిక్ష ప‌డాల‌ని ఈ సంద‌ర్భంగా అంకిత్ డిమాండ్ చేశారు.