విజ‌య్ చుట్టూ కొత్త వివాదం!

విజ‌య్ చుట్టూ కొత్త వివాదం!
విజ‌య్ చుట్టూ కొత్త వివాదం!

గ‌త కొంత కాలంగా త‌మిళ రాజ‌కీయాల‌కు స్టార్ హీరో విజ‌య్ టార్గెట్ అవుతూ వ‌స్తున్నారు. అథికార పార్టీని, కేంద్రంలో వుఏన్న బీజేపీని విమ‌ర్శించారంటూ మెర్స‌ల్ రిటీజ్ స‌మ‌యంలో త‌మిళ‌నాట పెద్ద ర‌చ్చ న‌డిపింది. ఆ త‌రువాత దానికి సంబంధించిన స‌న్నివేశాల‌ని, డైలాగ్‌ల‌ని తొల‌గించ‌డంతో వివాదం స‌మసిపోయింది. ఇదిలా వుంటే తాజాగా మ‌రోసారి హీరో విజ‌య్ పై మ‌రో వివాదం మొద‌లైంది. త్వ‌ర‌లో విజ‌య్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాలంటూ గ‌త కొంత కాలంగా ఆయ‌న అభిమానులు ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో 2021లో జ‌రిగే ఎన్నిక‌ల్లో విజ‌య్ రాజ‌కీయ అరంగేట్రం చేయాలంటూ ఫ్యాన్స్ అప్పుడే పోస్ట‌ర్ల‌తో త‌మిళ‌నాట హ‌ల్‌చ‌ల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగా విజ‌య్ ని దివంగ‌త నేత ఎంజీఆర్‌తో పోలుస్తూ పోస్ట‌ర్‌లు ఏర్పాటు చేశారు. అందులో విజ‌య్ ఎంజీఆర్ త‌ర‌హా వేష‌ధార‌ణ‌లో క‌నిపించ‌డం స‌రికొత్త వివాదానికి తెర తీసింది.

విజ‌య్ అభిమానుల తీరుకు ఆగ్ర‌హించిన అన్నా డీఎంకే నేత‌లు తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు. ఎంజీఆర్‌ని కించ‌ప‌రిచారంటూ ఆగ్ర‌మాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వివాదం హీరో విజ‌య్‌కి త‌ల‌నొప్పిగా మారింద‌ట‌. విజ‌య్ ప్ర‌స్తుతం `మాస్ట‌ర్‌` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది.