క్యాస్టింగ్‌ కౌచ్‌పై అన్న‌పూర్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

క్యాస్టింగ్‌ కౌచ్‌పై అన్న‌పూర్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
క్యాస్టింగ్‌ కౌచ్‌పై అన్న‌పూర్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

క్యాస్టింగ్ కౌచ్ గ‌త కొంత కాలంగా భార‌తీయ సినీ ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వ‌ర‌కు చాలా మంది దీనిపై గ‌ళం వినిపించారు. తాజాగా సీనియ‌ర్ తెలుగు న‌టి అన్న‌పూర్ణ‌మ్మ కీల‌క వ్యాఖ్య‌మ‌లు చేశారు. త‌ప్పు అనేది ఎప్పుడూ ఒక‌రివైపే వుండ‌ద‌ని, ఇద్ద‌రికీ ఇష్ట‌‌మైతేనే కొన్ని త‌ప్పులు జరుగుతాయ‌ని ఆమె ఈ సంద‌ర్భంగా అన్నారు.

న‌టిగా, క‌థానాయిక‌గా, స‌హాయ న‌టిగా త‌ల్లి పాత్ర‌ల‌కు కీల‌కంగా నిలిచిన అన్న‌పూర్ణ‌మ్మ ప్ర‌స్తుతం `ఎఫ్‌3`లో న‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. `నాటకాల నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టాను. కెరీర్ ఆరంభంలోనే నా పేరును ఉమా నుంచి అన్న‌పూర్ణ‌గా మార్చుకున్నాను. న‌టిగా, క‌థానాయిక‌గా.. ముఖ్యంగా ప‌లువురు న‌టీన‌టుల‌కు త‌ల్లి పాత్ర‌ల‌లో న‌టించాను. నేను క‌లిసి ప‌నిచేసిన న‌టీన‌టులంద‌రూ న‌న్ను గౌర‌వించారు` అని తెలిపారు అన్న‌పూర్ణ‌.

ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ `క్యాస్టింగ్ కౌచ్ అనేది అన‌వ‌స‌ర‌పు వ్య‌వ‌హారం. ప్ర‌తి రంగంలోనూ మ‌హిళ‌లు ఇలాంటివి ఎదుర్కొంటున్నారు. కానీ ఇల్లు, కుటుంబం, గౌర‌వం అనే వాటిని దృష్టిలో వుంచుకుని వేటికి లొంగ‌కుండా మ‌హిళ‌లు త‌ప్పించుకు వ‌చ్చేస్తున్నారు. అదే మాదిరిగా ఇక్క‌డి వాళ్లు కూడా త‌ప్పించుకోవాలి. క్యాస్టింగ్ కౌచ్ అంటే రెండు వైపులా ఆలోచించాలి. ఒక వేళ అలాంటి సంఘ‌ట‌న‌లు ఎదురైతే వెంట‌నే నోరు విప్పాలి. త‌ప్పులు జ‌ర‌గ‌వ‌ని నేను చెప్ప‌ను. ఇద్ద‌రికీ ఇష్ట‌మైతేనే కొన్ని త‌ప్పులు జ‌రుగుతాయ్‌. అలాగే అవ‌కాశాల కోసం తిరిగే వారికీ క‌ష్టాలు ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి` అన్నారామె.