ఇంటర్వెల్ షూట్ కు సై అంటోన్న రజినీ

ఇంటర్వెల్ షూట్ కు సై అంటోన్న రజినీ
ఇంటర్వెల్ షూట్ కు సై అంటోన్న రజినీ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం అన్నాతే. ఈ చిత్రాన్ని శివ తెరకెక్కిస్తున్నాడు. హైదరాబాద్ లోని రామోజి ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా టీమ్ లో పలువురికి కరోనా సోకడంతో షెడ్యూల్ ను అర్ధాంతరంగా ఆపాల్సి వచ్చింది. మరోవైపు వెంటనే రజినీకాంత్ అస్వస్థత పాలవ్వడం, హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం, కోలుకున్నాక అటు నుండి చెన్నైకు వెళ్లడం జరిగాయి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని కూడా విరమించుకున్నారు.

ఇదిలా ఉంటే దాదాపు రెండు నెలల విరామం తర్వాత రజినీకాంత్ తిరిగి షూటింగ్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ నెలలోనే అన్నాతే షూటింగ్ తిరిగి మొదలుకానుంది తెలుస్తోంది. ముందుగా ఇంటర్వెల్ సీన్లను షూట్ చేస్తారని సమాచారం.

నవంబర్ 4న దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తున్నారు.