అక్కినేని మల్టీస్టారర్ కు రంగం సిద్ధం

another akkineni multistarrer on cards
అక్కినేని మల్టీస్టారర్ కు రంగం సిద్ధం

ప్రస్తుతం అక్కినేని హీరోల పరిస్థితి ఏమంత బాగోలేదు. నాగార్జున హిట్ కొట్టి చాలా కాలమైంది. రీసెంట్ గా విడుదలైన మన్మథుడు 2 దారుణమైన ఫలితాన్ని మిగిల్చింది. అక్కినేని అఖిల్ మూడు సినిమాలు చేసినా ఇంకా బోణి కొట్టలేదు. నాగ చైతన్య మజిలీతో డీసెంట్ హిట్ కొట్టాడు కానీ అంతకు ముందు పరిస్థితి దాదాపుగా ఇంతే. నాగార్జున సంగతి వేరు కానీ నాగ చైతన్య, అఖిల్ లకు వరస హిట్లు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు యువ కథానాయకుల మధ్య పోటీ బాగా పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. నాగ చైతన్య, అఖిల్ కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తే సినిమాకు బజ్ బాగుంటుందని నాగార్జున సూచించాడట. అక్కినేని వారు మల్టీస్టారర్ స్క్రిప్ట్ కోసం వెతుకుతున్న సమయంలో ఆరెక్స్ 100 తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి వినిపించిన లైన్ బాగా నచ్చిందట. ప్రస్తుతం అజయ్ భూపతి స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. మరి ఈ అక్కినేని మల్టీస్టారర్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.