ఇస్మార్ట్ శంకర్ ని చుట్టుకున్న మరో వివాదం

ఇస్మార్ట్ శంకర్ ని చుట్టుకున్న మరో వివాదం
ఇస్మార్ట్ శంకర్ ని చుట్టుకున్న మరో వివాదం

ఇస్మార్ట్ శంకర్ చిత్రం వివాదాలతో సతమతమైపోతోంది . మొదట్లో ఈ సినిమా కథ నాదే అంటూ ఓ యువ రచయిత ఆరోపణలు చేయడం , ఆ తర్వాత హాలీవుడ్ నుండి స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించానని పూరి బదులివ్వడం జరిగింది . కట్ చేస్తే సినిమా హిట్ టాక్ వచ్చాక నటుడు ఆకాష్ ఈ కథ నాదే నా తమిళ సినిమాని కాపీ కొట్టి ఇలా తీశారు అంటూ మీడియా ముందుకు వచ్చాడు .

ఇక ఇప్పుడేమో కర్ణాటకలో పబ్లిక్ ఎక్కువగా తిరిగే ప్రదేశంలో అభ్యంతరకరమైన పోస్టర్ లు వేశారని దర్శక నిర్మాతలకు నోటీసులు అందించారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ వాళ్ళు . ఇక ఈ నోటీసులకు పూరి చార్మి సమాధానం చెప్పాల్సి ఉంది . ఈ వివాదాలు ఎలా ఉన్నా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది ఇస్మార్ట్ శంకర్ .