మరో వివాదాన్ని రాజేస్తున వర్మ


Another controversy on ntr biopic

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించి మరో వివాదానికి తెరలేపాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ . ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా కథానాయకుడు , మహా నాయకుడు అంటూ రెండు కూడా జనవరి 2019 లోనే విడుదల కానున్నాయి అయితే వాటికీ పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించాడు వర్మ . ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చాకే అతడి నిజమైన జీవితం మొదలయ్యిందని సంచలన కామెంట్ చేసాడు వర్మ .

ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఎంటర్ అయ్యాక అనూహ్య మలుపులు తిరిగింది అతడి జీవితం అంతేకాదు ఆమె వ్యవహారం నచ్చక ఎన్టీఆర్ ని గద్దె దించారు చంద్రబాబు అండ్ కో . లక్ష్మీపార్వతి వ్యవహారం అంటే ఎన్టీఆర్ వెన్నుపోటు అంశం తప్పకుండా ఉండాల్సిందే అలాగే ఎన్టీఆర్ కూడా అర్దాంతరంగా చనిపోయిన విషయం కూడా ప్రస్తావనకు రావాల్సిందే . ఇన్ని అంశాలు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఉంటే తప్పకుండా వివాదాలు సృష్టించడం ఖాయం . దానికి బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి . అసలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా ? వెళ్ళినా సకాలంలో విడుదల అవుతుందా ? ఇవన్ని మిలియన్ డాలర్ల ప్రశ్నే !

English Title: Another controversy on ntr biopic