మరో ప్లాప్ ని మూటగట్టుకున్న సందీప్ కిషన్


Another flop for hero sandeep kishan

యంగ్ హీరో సందీప్ కిషన్ కు గతకొంతకాలంగా కాలం కలిసి రావడం లేదు. వరుసగా పరాజయాలు పొందుతూ రేసులో వెనుకబడిపోతున్నాడు. తాజాగా మంజుల దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన మనసుకి నచ్చింది చిత్రం నిన్న విడుదల అయ్యింది అయితే ఆ సినిమాకు మొదటి రోజునే డిజాస్టర్ టాక్ వచ్చింది. స్లో నెరేషన్ తో ఈ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు అసహనానికి గురౌతున్నారు.

 

ఇక సందీప్ కిషన్ విషయానికి వస్తే …… ఈ హీరో కు సక్సెస్ లేక చాలాకాలం అయ్యింది. అయితే అప్పటి నుండి సక్సెస్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు . తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా నటిస్తున్నాడు కానీ ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇక ఈ హీరో కథల విషయంలో జాగ్రత్తలు పేరిట ఎన్నో పాటిస్తున్నాడు కానీ అందులో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు పాపం. తాజాగా మనసుకి నచ్చింది తో మరో ప్లాప్ అందుకున్నాడు పాపం.