దిల్ రాజు కు నష్టాలు తప్పవా ?


Another flop gets Dil raju

ఇప్పటికే హ్యాట్రిక్ ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు . లవర్ , శ్రీనివాస కళ్యాణం , హలో గురు ప్రేమకోసమే ఈ మూడు చిత్రాలు కూడా ప్లాప్ అయి దిల్ రాజు బ్యానర్ ఇమేజ్ ని దెబ్బకొట్టాయి . కట్ చేస్తే రజనీకాంత్ సినిమా అందునా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అని 2. ఓ చిత్రాన్ని మరో ఇద్దరు మిత్రులు ఎన్వీ ప్రసాద్ , యువి క్రియేషన్స్ లతో కలిసి కొన్నాడు దిల్ రాజు . నవంబర్ 29 న విడుదలైన 2. ఓ చిత్రం భారీ వసూళ్ల ని సాధిస్తోంది కానీ ఈ సినిమాని మరీ ఎక్కువ రేటు కి కొనడంతో అది వర్కౌట్ అయ్యేలా లేదు .

550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2. ఓ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో 75 కోట్లకు కొన్నారట . అయితే ఇప్పుడు అయిదు రోజుల్లో కేవలం 36 కోట్ల 35 లక్షలు మాత్రమే వసూల్ చేసింది . అంటే మరో 40 కోట్లు వసూల్ కావాలి అన్నమాట . ఆ సొమ్ము రాబట్టేంత దమ్ము ఈ సినిమాకు ఉందా ? అన్నది ఇప్పుడు తేలాలి . పెద్ద సినిమాలు ఇప్పట్లో ఏమి లేవు కానీ 2. ఓ చిత్ర థియేటర్ లు ఫుల్స్ కావడం లేదు , ఒకవేళ హౌజ్ ఫుల్ అయితే తప్పకుండా వచ్చే సూచన ఉంటుంది కానీ మిగతా రోజుల్లో 40 కోట్ల షేర్ రావడం అంటే మిరాకిల్ అనే చెప్పాలి . మరో ఆ అద్భుతాన్ని సృష్టిస్తుందా ? అంటే డౌటే అని చెప్పాలి . ఒకవేళ ఆ సొమ్ము రాబట్టకపోతే దిల్ రాజు తో పాటుగా ఎన్వీ ప్రసాద్ కు యువి క్రియేషన్స్ కు నష్టాలు తప్పవు .

English Title: Another flop gets Dil raju