ఇదం జగత్ తో మరో ప్లాప్ కొట్టిన సుమంత్


Another flop for sumanth
Sumanth

అక్కినేని నాగేశ్వర్ రావు మనవడిగా తెరంగేట్రం చేసిన సుమంత్ కి  అసలు కాలం కలిసి రావడం లేదు . 1999 లో హీరోగా పరిచయం అయ్యాడు సుమంత్ అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ అన్నమాట . మరి కొద్దీ రోజుల్లోనే 20 సంవత్సరాల కెరీర్ ని పూర్తి చేసుకోబోతున్నాడు కానీ సక్సెస్ మాత్రం ” సత్యం ” సినిమా ఒక్కటే . సత్యం మాత్రమే సాలిడ్ హిట్ అయితే కొన్ని చిత్రాలు అరకొర విజయాలు సాధించాయి కానీ అవేవి సుమంత్ కు ఉపయోగపడలేదు .

తాజాగా ఇదం జగత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్ . నిన్న విడుదలైన ఈ సినిమా థియేటర్ లలో ప్రేక్షకులు లేక వెలవెల బోయాయి థియేటర్ లన్ని . నటుడిగా సుమంత్ రాణించినప్పటికీ సినిమా ఆకట్టుకునే రీతిలో లేకపోవడం ఒక కారణమైతే , సుమంత్ ఇమేజ్ పూర్తిగా తగ్గిపోవడం మరో కారణం దాంతో ఈ సినిమాని పట్టించుకునే వాళ్లే లేకుండాపోయారు . ఇదం జగత్ తో మరో ప్లాప్ సుమంత్ ఖాతాలో పడింది .

English Title: Another flop for sumanth