అల్లు ఫ్యామిలీ నుండి మరో హీరో


allu-megafamily-hero-viran
ఇప్పటికే టాలీవుడ్ వారసులతో నిండిపోయింది , ఇక మెగా క్యాంప్ నుండే అయితే ఓ డజన్ మంది వరకు ఉన్నారు కాగా ఆ లిస్ట్ లో మరో హీరో చేరుతున్నాడు . అల్లు అరవింద్ కు బంధువైన విరాన్ ముత్తం శెట్టి అనే యువకుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు . అల్లు కుటుంబం నుండి ఇప్పటికే అల్లు అర్జున్ , అల్లు శిరీష్ లు హీరోలుగా ఉన్నారు అయితే అల్లు అర్జున్ మాత్రమే స్టార్ గా ఎదిగాడు . 
 
ఇక ఇప్పుడేమో అల్లు అరవింద్ పేరు అడ్డుపెట్టుకొని అడుగు పెడుతున్నాడు విరాన్ మొత్తం శెట్టి . ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది . అయితే యాక్షన్ , ఫ్యాక్షన్ కాకుండా డివోషనల్ సబ్జెక్టు తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట విరాన్ . హీరోకు కావాల్సిన అన్ని అంశాలలో తర్ఫీదు పొందాడు విరాన్ . వారసులకు ఎంట్రీ ఈజీనే కానీ సక్సెస్ కొడితేనే ఇక్కడ నిలబడేది లేకపోతే అంతే !