మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నాడు


another hero from mega family

మెగా ఫ్యామిలీ లో ఇప్పటికే పలువురు హీరోలు ఉండగా, హీరోలు మాత్రమే కాదు హీరోయిన్ లు కూడా వస్తారు అంటూ నిహారిక తెరంగేట్రం చేసింది . కాగా ఇప్పుడు మరో హీరో మెగా కుటుంబం నుండి రావడానికి రంగం సిద్ధం అవుతోంది . మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అవసరాల శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది .

వైష్ణవ్ తేజ్ బాలనటుడి గా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే ! చిరంజీవి హీరోగా నటించిన ” శంకర్ దాదా ఎం బిబిఎస్ ” చిత్రంలో వీల్ చెయిర్ లో అచేతనంగా ఉండే బాలుడి పాత్ర ని పోషించింది ఈ వైష్ణవ్ తేజ నే ! ఇతడ్ని హీరోగా పరిచయం చేయాలనీ చాలామంది ప్రయత్నాలు చేస్తుండటంతో డ్యాన్స్ లో ఫైట్స్ లలో అలాగే నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్ . ఇతడి రాకతో డజన్ మంది హీరోలు అయ్యేలా ఉంది మెగా ఫ్యామిలీ .