గుంటూరు లో మరో దారుణం


another rape attempt in guntur

గుంటూరు లో మరో దారుణం జరగడంతో పాత గుంటూరు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . ఇటీవలే వరుసగా మూడు సంఘటనలు గుంటూరు జిల్లా లో జరుగగా తాజాగా మరో మైనర్ బాలిక పై అత్యాచారానికి ప్రయత్నించడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలతో ఊగిపోయారు దాంతో పోలీసులకు , ఆందోళన కారులకు వాగ్వాదం జరిగింది ఒకదశలో ఇది శృతి మించడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయగా , ఆందోళన కారులు పోలీసులపైకి రాళ్ళూ రువ్వారు . ఆ సంఘటనలో పోలీసులకు స్వల్ప గాయాలు కాగా పోలీస్ వాహనాలు ద్వంసం అయ్యాయి .

సంఘటన పూర్వాపరాలలోకి వెళితే …… పాత గుంటూరు లోని ఓ బేకరీ లో పనిచేసే రాజాసింగ్ రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసం ఉంటున్నాడు అయితే ఆ పక్కనే ఆడుకుంటున్న ఓ మైనర్ బాలిక ని తనతో పాటు ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోతుండగా పదేళ్ల ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో వెంటనే అప్రమత్తమైన చుట్టుపక్కల వాళ్ళు రాజాసింగ్ ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు . అయితే నిందితుడి ని వెంటనే శిక్షించాలని గట్టిగా పట్టుబట్టడంతో అందుకు పోలీసులు నిరాకరించారు దాంతో ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది . ఆవేశం ఆపుకోలేని కొంతమంది యువకులు పట్టరాని ఆవేశంతో పోలీసుల పైకి రాళ్ళూ రువ్వడంతో గుంటూరు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితిలు ఏర్పడ్డాయి . మహిళలపై , చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులను వెంటనే శిక్షించాలని లేకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆవేదనతో అంటోంది నన్నపనేని రాజకుమారి .