ప్రభాస్ పెళ్లి పై మరో పుకారు


ప్రభాస్ పెళ్లి పై మరో పుకారు
Prabhas marriage

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పై పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి . ఇప్పటికే బోలెడు పుకార్లు రాగా తాజాగా అమెరికాలో స్థిరపడిన తెలుగమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కథనాలు వస్తున్నాయి . ప్రభాస్ పెళ్లి గురించి రకరకాలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి , సంవత్సరాల కొద్దీ సంవత్సరాలు గడిచి పోతూనే ఉన్నాయి కానీ ప్రభాస్ పెళ్లి మాత్రం కావడం లేదు.

ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్ కు 40 ఏళ్ళు వచ్చాయి . పెళ్లి ముచ్చట ఎప్పుడో తీరాల్సి ఉంది కానీ మనోడు మాత్రం పెళ్లి ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నాడు . ఇన్నాళ్లు రకరకాలుగా వినిపించినా అనుష్క తో సెట్ అవ్వడం ఖాయమని అన్నారు కానీ ఇపుడు అమెరికా అమ్మాయి అని వినిపిస్తోంది ఏంటో ?