ఎన్టీఆర్ అక్కగా నాగ్ నాటితరం హీరోయిన్?

ఎన్టీఆర్ అక్కగా నాగ్ నాటితరం హీరోయిన్?
ఎన్టీఆర్ అక్కగా నాగ్ నాటితరం హీరోయిన్?

అక్కినేని నాగార్జున నటించిన క్లాసిక్ కామెడీ చిత్రం మన్మధుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది అన్షు. తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకర్షించింది. మన్మధుడు సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాఘవేంద్ర సినిమాలో కూడా అన్షు హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాల తర్వాత అన్షు మరే తెలుగు చిత్రం చేయకపోవడం గమనార్హం. అయితే దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈమె మళ్ళీ నటించబోతోంది అంటూ రూమర్లు షికార్లు చేస్తున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ ఏడాది సమ్మర్ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అక్కగా అన్షును తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. అక్టోబర్ 13న ఈ చిత్రం భారీ రేంజ్ లో విడుదల కానుంది.