ఆన్ లైన్ లో లీకైన అంతరిక్షం చిత్రం


Antariksham full movie leaked

కోట్లు పోసి నిర్మించిన అంతరిక్షం చిత్రాన్ని కూడా పైరసి భూతం పట్టేసింది . వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం చిత్రం ఈనెల 21న విడుదలైన విషయం తెలిసిందే . సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై వరుణ్ తేజ్ మాత్రమే కాదు మిగతా యూనిట్ అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాసలయ్యాయి . అంతరిక్షం చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు . ఏ సెంటర్ ప్రేక్షకులు మాత్రం ఆదరిస్తున్నారు . కానీ బిసి కేంద్రాల్లో ఈ సినిమా థియేటర్ లు వెలవెలబోతున్నాయి .

అసలే సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది అని చిత్ర బృందం బాధపడుతుంటే సినిమా మొత్తం లీక్ కావడం మరో షాకింగ్ న్యూస్ . కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి తీసిన సినిమా ఆడటం లేదని బాధపడుతుంటే ఈ లీకుల గోల ఏంట్రా బాబు అని తల పట్టుకుంటున్నారు పాపం చిత్ర బృందం . తమిళనాట ఉన్న పైరసీదారులు కొత్త చిత్రాలను ఎప్పటికప్పుడు లీక్ చేస్తూ సవాల్ విసురుతూనే ఉన్నారు .

English Title: Antariksham full movie leaked