అంతరిక్షం సెన్సార్ రిపోర్ట్


Anthariksham censor report
Varun Tej

వరుణ్ తేజ్ , అదితిరావు హైదరి , లావణ్య త్రిపాఠి నటించిన చిత్రం అంతరిక్షం . ఘాజి వంటి సంచలన చిత్రానికి దర్శకత్వం వహించిన సంకల్ప్ రెడ్డి ఈ అంతరిక్షం చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి . ఈనెల 21న విడుదల కానున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర బృందాన్ని అభినందించడమే కాకుండా దర్శకుడు సంకల్ప్ పై ప్రశంసల వర్షం కురిపించారట .

తెలుగులోనే కాకుండా భారత్ లోనే ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదు దాంతో సంకల్ప్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తున్నారు . సైంటిఫిక్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మాతలు నిర్మించడం విశేషం . అంతరిక్షంలో సాగే కథతో తెరకెక్కడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా కొత్త తరహా చిత్రం అవ్వడం ఖాయం . ఈ సినిమా ప్రేక్షకులు మెచ్చేలా ఉంటే తప్పకుండా ఇలాంటి విభిన్నమైన చిత్రాలు మరిన్ని రావడం ఖాయం . ఇక దర్శకుడు సంకల్ప్ రెడ్డి అంతరిక్షం హిట్ అయితే తప్పకుండా పార్ట్ 2 తీస్తానని అంటున్నాడు . సెన్సార్ రిపోర్ట్ బాగుంది , ఇక సినిమా ఏంటి అన్నది ఈనెల 21న ప్రేక్షకులు తీర్పు ఇవ్వనున్నారు . ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు.

English Title: Anthariksham censor report