`కార్తికేయ‌2`లో అనుప‌మ్‌ఖేర్!

Anupam kher as dhanvantri in Karthikeya 2
Anupam kher as dhanvantri in Karthikeya 2

యూత్ ఆడియ‌న్స్‌లో యంగ్ హీరో నిఖిల్ కు ప్ర‌త్యేక‌మైన గుర్తిం‌పుంది. `అర్జున్ సుర‌వ‌రం`తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చిన నిఖిల్ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ య‌మ బిజీగా వున్నారు. ఆయన న‌టిస్తున్న తాజా చిత్రం `కార్తికేయ‌2`. నిఖిల్ కెరీర్‌లో సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచిన `కార్తికేయ‌` చిత్రానికిది రీమేక్‌. ఎనిమిల్ హిప్నాటిజం అనే స‌రికొత్త పాయింట్‌కి సుబ్ర‌మ‌ణ్య స్వామి నేప‌థ్యాన్ని జోడించి స‌రికొత్త చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించారు చందూ మొండేటి.

ఇదే చిత్రానికి ప్ర‌స్తుతం `కార్తికేయ 2` పేరుతో సీక్వెల్ ని తెర‌కెక్కిస్తున్నారు. అత్యుత్త‌మ చిత్రాల‌ని అందిస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో అభిరుచిగ‌ల నిర్మాణ సంస్థ‌లుగా పేరు తెచ్చుకుంటున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది శ్రీ‌తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర‌స్వామి స‌న్నిధిలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ మూవీ ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి చేసుకుని సెట్స్ పైకి వెళ్ల‌డానికి సిద్ధంగా వుంది.

అత్యంత భారీ స్థా‌యిలో రూపొంద‌నున్న‌ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో  క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్‌ఖేర్ న‌టించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా వెల్ల‌డించింది. త‌మ చిత్రంలోకి అనుప‌మ్‌ఖేర్ ను ఆహ్వానిస్తున్న‌ట్టు ఈ సంద‌ర్భంగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో ఆయ‌న పాత్ర పేరు త‌న‌వంత‌రీ. ఆయ‌న పాత్ర ఆస‌క‌ర్తిక‌రంగా వుంటుందని చిత్ర బృందం తెలిపింది.