నిఖిల్ కు జోడిగా మలయాళ భామ ఫిక్స్ అయినట్టేనా?


నిఖిల్ కు జోడిగా మలయాళ భామ ఫిక్స్ అయినట్టేనా?
నిఖిల్ కు జోడిగా మలయాళ భామ ఫిక్స్ అయినట్టేనా?

యంగ్ హీరో నిఖిల్ గతేడాది విడుదలైన అర్జున్ సురవరం సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన విషయం తెల్సిందే. వరస ప్లాపులతో సతమవుతున్న నిఖిల్ కు అర్జున్ సురవరం పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఇదే ఉత్సాహంతో 2020లో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు నిఖిల్. మొదటిది ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న కార్తికేయ సీక్వెల్. నిఖిల్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ అనదగ్గ కార్తికేయ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఎప్పటినుండో చెబుతూ వస్తున్నారు. ఫైనల్ గా ఈ ఏడాది కార్తికేయ 2 సెట్ అయింది. కార్తికేయ 2కు సంబంధించి ఇంట్రడక్షన్ టీజర్ ను కూడా విడుదల చేసారు. షూటింగ్ మొదలుపెడదామనుకున్నప్పుడే కరోనా కారణంగా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ను పర్మిషన్ వచ్చిన వెంటనే మొదలుపెట్టాలని భావిస్తున్నారు.

ఇక రెండో సినిమా 18 పేజిస్. కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సుకుమార్, గీత ఆర్ట్స్ 2 కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. గతంలో ఈ సినిమాకు అను ఇమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకుందామని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ ను ఈ సినిమా కోసం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

గతేడాది రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టినా కానీ అనుపమకు అవకాశాల వెల్లువ రాలేదు. మరి నిఖిల్ చిత్రంతోనైనా అనుపమ కెరీర్ మారుతుందేమో చూడాలి.