నిఖిల్ 18 పేజెస్ లో ఆమె ఫిక్స్anupama fix in nikhil 18 pages
anupama fix in nikhil 18 pages

యువ హీరో నిఖిల్ గతేడాది అర్జున్ సురవరం చిత్రంతో సూపర్ హిట్ కొట్టి ప్లాపులకు బ్రేక్ వేసాడు. ఇక ఈ ఏడాది కాస్త గ్యాప్ తీసుకుని వరసగా రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి కార్తికేయ 2 కాగా మరొకటి 18 పేజెస్. సుకుమార్, అల్లు అరవింద్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకానుంది. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న.

ఈ చిత్రంలో హీరోకు మెమరీ లాస్ ఉంటుందిట. అయితే ఆ పాయింట్ ను కూడా సరికొత్తగా ప్రెజంట్ చేయబోతున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే మెమరీ లాస్ ప్రేక్షకులకు ఒక షాక్ ఫ్యాక్టర్ ను ఇస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ముందు నుండీ అనుపమ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఎట్టకేలకు అది దూరమైంది. ఆఫర్లకోసం ఎదురుచూస్తోన్న అనుపమకు ఇది నిజంగా సూపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.