సంచ‌ల‌నం సృ‌ష్టిస్తున్న అనుప‌మ షార్ట్ ఫిల్మ్‌!


సంచ‌ల‌నం సృ‌ష్టిస్తున్న అనుప‌మ షార్ట్ ఫిల్మ్‌!
సంచ‌ల‌నం సృ‌ష్టిస్తున్న అనుప‌మ షార్ట్ ఫిల్మ్‌!

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ `ప్రేమ‌మ్‌` మూవీతో త‌నేంటో నిరూపించుకుంది. తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ మ‌ల‌యాళీ సోయ‌గం ప్ర‌స్తుతం సుకుమార్ శిష్యుడు సూర్య ప్ర‌తాప్ పల్నాటి ద‌ర్శ‌క‌త్వంలో జీఏ2 పిక్చ‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై బన్నీవాసు నిర్మిస్తున్న `18 పేజెస్‌` చిత్రంలో న‌టిస్తోంది. నిఖిల్ హీరోగా న‌టిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

ఇదిలా వుంటే ఇటీవ‌ల దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తూ నిర్మించిన చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా అవ‌తారం ఎత్తిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కొత్త‌గా ఓ షార్ట్ ఫిల్మ్‌లో న‌టించింది. `ఫ్రీడ‌మ్ @ మిడ్‌నైట్‌` పేరుతో మ‌ళ‌యాళంలో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్  ఇటీవ‌లే విడుద‌లై యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ నెల 9న యూట్యూబ్‌లో విడుద‌లైన ఈ ల‌ఘు చిత్రం రికార్డు స్థాయి వ్యూస్‌ని సొంతం చేసుకుంటోంది.

త‌క్కువ టైమ్‌లోనే 5 మిలియ‌న్ వ్యూస్‌ని ద‌క్కించుకుంది. ఓ గృహిణి త‌న భ‌ర్త నుంచి అర్థ్ర రాత్రి జ‌రిగే బ‌ల‌వంత‌పు శృంగారం నుంచి ఫ్రీడ‌మ్‌ని కోరుకుంటుంది. దీన్ని ప్ర‌ధాన క‌థ‌గా ఎంచుకుని ఓ గృహిణి మాన‌సిన సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్‌ని రూపొందించారు. విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకుంటున్న ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో రికార్డు దిశ‌గా వ్యూస్‌ని రాబ‌డుతోంది.