ఈ మల్లు భామకు అవకాశాలివ్వండిAnupama Parameswaran
ఈ మల్లు భామకు అవకాశాలివ్వండి

తెలుగులో సుడిగాలి ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాల్లో నటించేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అయితే సరైన ప్లానింగ్ లేని కారణంగా చాలా సినిమాలు బాల్చీ తన్నేయడంతో వచ్చిన లైమ్ లైట్ మొత్తం పోయింది. ఈ ఏడాది రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్నా అందులో అనుపమ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు.

ఈ నేపథ్యంలో మల్లు భామను పట్టించుకునే నిర్మాత/హీరో దొరకడం లేదు. సినిమాలు లేవని కామ్ గా కూర్చుంటే ఇండస్ట్రీ మర్చిపోతుంది కాబట్టి అనుపమ రోజుకో రకమైన ఫోటోషూట్ తో ఇన్స్టాగ్రామ్ ను హోరెత్తిస్తోంది. ఈ ఫోటోలు చూసైనా భామకు అవకాశాలివ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో అనుపమ మళ్ళీ మలయాళ సినిమాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

 

Credit: Instagram