పిచ్చెకించిన శృంగార దేవత


Anupama parameshwaran very hot in hello guru premakosame teaser

హీరో రామ్ తాజాగా ” హలో గురూ ప్రేమకోసమే ” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్రంలో రామ్ సరసన మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది . కాగా నిన్న సాయంత్రం హలో గురూ ప్రేమకోసమే చిత్ర టీజర్ ని విడుదల చేసారు కాగా ఆ టీజర్ చూస్తుంటే కుర్రకారుతో పాటుగా ముసలి వాళ్ళు సైతం పిచ్చెక్కిపోవడం ఖాయం అంత శృంగారంగా ఉంది . అనుపమ హొయలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అంతగా రెచ్చగొట్టింది టీజర్ లో . ఎక్స్ పోజింగ్ చేయలేదు , నిండైన చీరలోనే ఆ శృంగారం మొత్తాన్ని ఒలికించి యువతలో వీరావేశాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది అనుపమా పరమేశ్వరన్ .

నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మించింది దిల్ రాజు కావడం విశేషం . దిల్ రాజు చిత్రాలు కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రాలు ఉంటాయి అయితే ఈ సినిమా మాత్రం ప్రేమికులను పిచ్చపిచ్చగా ఆకర్షించేలా కనిపిస్తోంది టీజర్ చూస్తుంటే . టీజర్ లో అనుపమా పరమేశ్వరన్ – రామ్ ల డైలాగ్స్ మామూలుగానే ఉన్నాయి వినడానికి కానీ విజువల్ గా మాత్రం కుర్రకారు పిచ్చి పీక్స్ కి వెళ్లడం ఖాయం . అంత ఆదిగా ఉంది అనుపమా పరమేశ్వరన్ లుక్స్ . ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు . శృంగారాన్ని ఒలికించడంతో టీజర్ ఫాస్ట్ గా దూసుకుపోతోంది యుట్యూబ్ లో .

English Title: Anupama parameshwaran very hot in hello guru premakosame teaser