అనుప‌మ అకౌంట్‌కు హ్యాక‌ర్స్ దెబ్బ‌!


అనుప‌మ అకౌంట్‌కు హ్యాక‌ర్స్ దెబ్బ‌!
అనుప‌మ అకౌంట్‌కు హ్యాక‌ర్స్ దెబ్బ‌!

క‌ర్లింగ్ హెయిర్‌.. బుట్ట‌బొమ్మ‌లాంటి రూపంతో తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. మ‌ల‌యాళ చిత్రం `ప్రేమ‌మ్‌`తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అనుప‌మ ఆ త‌రువాత తెలుగులో `అఆ` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్‌గా `రాక్ష‌సుడు` చిత్రంతో డీసెంట్ హిట్‌ని సొంతం చేసుకుంది.

ఓ ప‌క్క హీరోయిన్‌గా న‌టిస్తూనే దుల్క‌ర్ స‌ల్మాన్ నిర్మిస్తున్న‌`మ‌ణియ‌రాయిలే అసోక‌న్‌` చిత్రంలో న‌టిస్తూనే అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తోంది. ఎప్పటి క‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో త‌న సినిమాల‌కు సంబంధించిన విష‌యాల్ని షేర్ చేసే అనుప‌మ‌కు స‌డ‌న్‌గా హ్యాక‌ర్స్ షాకిచ్చారు. లాక్ డౌన్ కార‌ణంగా సామాన్యుల‌తో పాటు స్టార్స్ అంతా ఇంటికే ప‌రిమిత‌మైపోయి ఫ్యాన్స్‌తో ట‌చ్‌తో వుంటున్నారు.

అనుప‌మ కూడా గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా త‌న అభిమానుల‌తో ట‌చ్‌లో వుంటోంది. త‌న‌కు సంబంధించిన కొత్త కొత్త విష‌యాల్ని వారితో పంచుకుంటూ ఫొటోల‌ని షేర్ చేస్తోది. ఇంత‌లోనే ఆమె ఫేస్‌బుక్ పేజ్‌ని హ్యాక‌ర్స్ హ్యాక్ చేయ‌డం షాక్‌కు గురిచేసింది. దీంతో వెంట‌నే త‌న పేజీని ఎవ‌రో హ్యాక్ చేశార‌ని, తాను చెప్పే వ‌ర‌కు ఆ పేజీలో వ‌చ్చే వార్త‌ల్ని న‌మ్మొద్దంటూ అనుప‌మ త‌న అభిమానుల‌తో వెల్ల‌డించింది. ఈ స‌మ‌యంలోనే అనుప‌మ పేజ్ పూర్తిగా డెలిట్ కావ‌డం అమె అభిమానుల‌ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంద‌ట‌.