బాధ్య‌త లేని జ‌నాన్ని ప్ర‌శ్నిస్తోంది!బాధ్య‌త లేని జ‌నాన్ని ప్ర‌శ్నిస్తోంది!
బాధ్య‌త లేని జ‌నాన్ని ప్ర‌శ్నిస్తోంది!

ప్ర‌పంచం ఏడుస్తోంది.. దేశం భ‌యంతో వ‌ణికిపోతోంది…ఊరు త‌గ‌ల‌డుతోంది… అయినా ఒక్క‌రిలో బాధ్య‌త లేదు. ఓ ప‌క్క క‌రోనా మూడేళ్ల ప‌సి మొగ్గ‌ని క‌బ‌లిస్తున్నా మ‌న జ‌నాల్లో నిబ‌ద్ధ‌త‌, భ‌యం ఏ కోశానా క‌నిపించ‌డం లేదు. ఒక్క‌డి త‌ప్పు యావ‌త్ ప్ర‌పంచాన్నే ద‌హించివేస్తోంది. పుహాన్ న‌గ‌రం చేసిన త‌ప్పుకి ఇప్పుడు యావ‌త్ ప్ర‌పంచం భ‌యం గుప్పిట్లోకి బ్ర‌తుకీడుస్తోంది. అయినా స‌రే మ‌న వాళ్ల‌లో ఏ మాత్రం భ‌యం, భాధ్య‌త క‌నిపించ‌డం లేదు.

ఇదే హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌రన్‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. వైర‌స్ బారిన ప‌డ‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా ముఖానికి పెట్టుకునే మాస్కుల్ని ధ‌రించిన జ‌నం వాటిని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పడేస్తున్నారు. రోడ్ల‌పై ఈ మాస్కులు ద‌ర్శ‌న మిస్తున్నాయి. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, బాధ్య‌తారాహిత్య‌మ‌ని అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మండిప‌డుతోంది. సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో మాస్కుల‌కు సంబంధించిన ఫొటోల్ని షేర్ చేసింది.

`వావ్ ఈ ఫొటోలు చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా వున్నాయి. మీకు అనిపించ‌డం లేదా? 500 మీట‌ర్ల ప‌రిధిలో కనిపించిన మాస్కులివి. మ‌నం క‌రోనాతో పోరాడుతున్న తీరు ఇదేనా?. ఇలా చేయ‌కండి. చెత్త‌కుండీలె ఎందుకున్నాయి?. ఎవ‌రికైనా ఇలాంటి మాస్కులు క‌నిపిస్తే ద‌య‌చేసి వాడొద్దు. నా డార్ట‌ర్ ఫ్రెండ్‌కి ఐసోలేష‌న్‌కి వెళుతుంటే దారి వెంట ఇవి క‌నిపించాయి. బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించండి` అంటూ అనుప‌మ మండిప‌డింది.