ఎట్టకేలకు “నిశ్శబ్దం”షూటింగ్ పూర్తి చేసిన అనుష్క!!


Anusha movie Nishabdham shooting finished
Anusha movie Nishabdham shooting finished

‘బాగమతి’ తర్వాత గ్లామర్ స్టార్ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకుడిగా కోన వెంకట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘సైలెన్స్’. తెలుగుగు తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగులో ఈ సినిమా ‘నిశ్శబ్దం’గా రానుంది.

కథ చాలా వరకు అమెరికాలో జరుగుతుందట. షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్ర యూనిట్ సెల్ఫీని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. అనుష్క ఆర్ట్ లవర్ గా ఈ సినిమలో కనిపిస్తారట.

మాధవన్ సెల్లో ప్లేయర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ పాత్రలతో ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా దర్శకుడు హేమంత్ రూపొందిస్తున్నాడు. ఇక అనుష్క బాహుబలి ది కంక్లూషన్ తర్వాత ఎంతో పేమస్ అయింది.

బాగమతితో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించి మెప్పించింది. మరి ఈ నిశ్శబ్దంలో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.. సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే లతో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. !!