మెగాస్టార్ ఆచార్య : చందమామ స్థానంలో స్వీటీ వస్తుందా?


మెగాస్టార్ ఆచార్య : చందమామ స్థానంలో స్వీటీ వస్తుందా?
మెగాస్టార్ ఆచార్య : చందమామ స్థానంలో స్వీటీ వస్తుందా?

అనుష్క శెట్టి ఈ మధ్య తన సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్ గా ఉంటోంది. సంవత్సరానికి మహా అయితే ఒక్క సినిమా చేస్తోంది అంతే. నిశ్శబ్దం సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన అనుష్క ఆ చిత్ర రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్ 2కు షెడ్యూల్ చేసారు కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. ఇప్పటికే ఏప్రిల్ 2న షెడ్యూల్ అయిన అరణ్య విడుదల నుండి తప్పుకుంది. మార్చ్ 25న విడుదల కావాల్సిన నాని చిత్రం వి కూడా పోస్ట్ పోన్ అయింది. ఇక నిశ్శబ్దం కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా అనుష్క మరో సినిమాను అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో సమాచారం ప్రకారం అనుష్కకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం లభించిందిట. అసలు చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాకు త్రిషను కథానాయికగా అనుకున్నారు. అయితే ఆమె వివిధ కారణాలతో చిత్రం నుండి తప్పుకుంది.

దాంతో ఇప్పుడు నిర్మాతలు వేరే హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు. వారి ముందుకు వచ్చిన మొదటి పేరు కాజల్ అగర్వాల్. ఇటీవలే చిరంజీవి సరసన ఖైదీ నెం 150లో నటించిన కాజల్ ను మరోసారి తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. అయితే చందమామ ఈ సినిమా చేయడానికి అడిగిన పారితోషికానికి నిర్మాతలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు కాజల్ ను హోల్డ్ లో ఉంచి వేరే ఆప్షన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.

గతేడాది సైరాలో అతిధి పాత్రలో మెరిసిన అనుష్క అయితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది. గతంలో స్టాలిన్ లో చిరంజీవి సరసన ఒక స్పెషల్ గీతంలో నర్తించింది అనుష్క. ఇప్పుడు హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. అయితే ఇంకా స్వీటీ ఏ విషయం చెప్పలేదట. అనుష్క కనుక నో అంటే కాజల్ నే తీసుకుందాం అనుకుంటున్నారని తెలిసింది.