టాలీవుడ్ లో మరో ప్రమాదం : అనుష్క కు గాయాలు


Anushka Shetty
Anushka Shetty

టాలీవుడ్ లో మరో ప్రమాదం జరిగింది , ఇప్పటికే పలు ప్రమాదాలు జరుగగా పలువురు యంగ్ హీరోలు గాయాల బారిన పడ్డారు . వరుస ప్రమాదాలతో టాలీవుడ్ షాక్ అవ్వగా తాజాగా మరో ప్రమాదం జరిగింది . ఈసారి హీరోయిన్ అనుష్క వంతు వచ్చిందన్న మాట . సాలిడ్ హీరోయిన్ అనుష్క సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ లో గాయపడింది . కాలుకి గాయం కావడంతో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని సలహా ఇచ్చారట డాక్టర్లు .

అయితే అనుష్క కాలికి గాయం అయినప్పటికీ అది పెద్దది కాదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . అనుష్క చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తోంది . ధీరవనిత గా అలా మెరిసి ఇలా మాయం కానుంది , కాగా ఆ సినిమా షూటింగ్ లో గాయం కావడంతో పాపం రెస్ట్ తీసుకోవాల్సి వస్తోంది .