కార్తికేయ పెళ్ళిలో రెచ్చిపోయిన ప్రభాస్Anushka and Prabhas special attraction in karthikeya marriage
Prabhas

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తికేయ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జైపూర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే . ఆ వేడుకలో పాల్గొనడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు తరలి వెళ్లారు . కాగా ఆ వేడుకలో ప్రభాస్అనుష్క స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు . ఇక ప్రభాస్ అయితే రెచ్చిపోయి జక్కన్న తో కలిసి డ్యాన్స్ చేసి ఆహుతులను అలరించాడు .

అనుష్క ఇంకా లావుగానే కనిపిస్తోంది , ఇంకా తగ్గాలి కానీ తగ్గలేదు . ఇక ప్రభాస్ అనుష్కతో ముచ్చట్లు ఈ వేడుకలో హైలెట్ గా నిలిచాయట . బాహుబలి సమయంలో దాదాపు అయిదేళ్ల పాటు అనుబంధం ఉంది ప్రభాస్, రాజమౌళి లకు , ఇక అనుష్క తో నాలుగు సినిమాలు చేసాడు ప్రభాస్ దాంతో అప్పటి నుండి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి కానీ ఎప్పటికప్పుడు ఆ వార్తలను ఖండిస్తూనే ఉన్నారు ప్రభాస్ – అనుష్కలు . ఇక ఇప్పుడేమో చిన్నవాడైన కార్తికేయ పెళ్లి కూడా అయిపొయింది మరి వీళ్ళ పెళ్లి ఎప్పుడో !

 

English Title: Anushka and Prabhas special attraction in karthikeya marriage