దేవ‌సేన షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంటోందా?


దేవ‌సేన షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంటోందా?
దేవ‌సేన షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంటోందా?

‌`బాహుబ‌లి` సిరీస్‌లో దేవ‌సేన‌గా త‌న‌దైన మార్కు న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకున్న స్వీటీ అలియాస్ అనుష్క షాకింగ్ నిర్ణ‌యం తీసుకోనుందా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. `బాహుబ‌లి` రిలీజ్‌కి ముందు రిలీజ్ త‌రువాత అనుష్క పెద్ద‌గా సినిమాల్ని అంగీక‌రించ‌లేదు. 2017లో అనుష్క న‌టించిన `బాహుబ‌లి 2` చిత్రం విడుద‌లైంది. ఆ త‌రువాత అనుష్క న‌టించినవి రెండే రెండు చిత్రాలు ఒక‌టి `భాగ‌మ‌తి`, `నిశ్శ‌బ్దం`.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రంలో మెగాస్టార్ మాట కాద‌న‌లేక అతిథి పాత్ర‌లో న‌టించింది. అనుష్క `నిశ్శ‌బ్దం` త‌రువాత గౌత‌మ్‌మీన‌న్ చిత్రంలో న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఆ సినిమా ప‌ట్టాలెక్కేలా క‌నిపిపించ‌డం లేదు. అనుష్క గ‌త కొంత కాలంగా సినిమాల ఎంపిక విష‌యంలో తీసుకుంటున్న నిర్ణ‌యాల్ని బ‌ట్టి చూస్తే క్ర‌మ క్ర‌మంగా అమె సినిమాల‌కు దూరం కావాల‌నే ఇలా సినిమాల్ని అంగీక‌రించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

`బాహుబ‌లి 2` త‌రువాత నుంచి ఆమె చేసిన సినిమాలని ఎంచుకుంటున్న తీరు ఇందుకు అద్దంప‌డుతోందని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదిలా వుంటే అనుష్క న‌టించిన `నిశ్శ‌బ్దం` రిలీజ్ వివిష‌యంలో మేక‌ర్స్ ఈ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో రిలీజ్ చేయాలా?  లేక ప్ర‌స్తుత ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఓటీటీకే సై అనాలా అని ఆలోచిస్తున్నార‌ట‌.