వెబ్ సిరీస్ ప్ర‌పోజ‌ల్‌ని తిర‌స్క‌రించిందా?


వెబ్ సిరీస్ ప్ర‌పోజ‌ల్‌ని తిర‌స్క‌రించిందా?
వెబ్ సిరీస్ ప్ర‌పోజ‌ల్‌ని తిర‌స్క‌రించిందా?

క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోయిన విష‌యం తెలిసిందే. పైగా థియేట‌ర్లు కూడా తెర‌వ‌క‌పోవ‌డంతో ఓట‌టీకు డిమాండ్ పెరిగింది. చాలా మంది ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఓటీటీనే క‌రెక్ట్ అని అటు వైపు అడుగులు వేయ‌డం మొద‌లుపెట్టారు. మ‌ణిర‌త్నం లాంటి ద‌ర్శ‌కుడు కూడా ఓటీటీ కోసం ఓ భారీ వెబ్ సిరీస్‌ని నిర్మించ‌డానికి ప్లాన్లు వేస్తున్న విష‌యం తెలిసిందే. సూర్య‌తో పాటు ప‌లు కీల‌క న‌టులు ఈ వెబ్ సిరీస్‌లో న‌టించ‌బోతున్నారు.

ఇదిలా వుంటే టాలీవుడ్ జేజ‌మ్మ దేవ‌సేన అనుష్క‌కు ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ వెబ్ సిరీస్ కోసం భారీ ఆఫ‌ర్‌ని ఇచ్చింద‌ట‌. రికార్డు స్థాయిలో పారితోషికం ఇస్తాన‌న్నా అనుష్క మాత్రం వెబ్ సిరీస్‌లో న‌టించేది లేద‌ని, త‌న‌కు అలాంటి ఆలోచ‌నే లేద‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. నెట్‌ప్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ సంస్థ‌లు భారీ తారాగ‌ణంతో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నాయి. ఇందులో క్రేజీ హాలీవుడ్ స్టార్లు న‌టిస్తున్నారు కూడా. అదే స్థాయిలో ఓ వెబ్ సిరీస్‌ని ప్లాన్ చేసిన ‌నెట్‌ప్లిక్స్ స్వీటీకి భారీ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. ఈ ఆఫ‌ర్‌ని అనుష్క సున్నితంగా తిర‌స్క‌రించిద‌ట‌.

అనుష్క న‌టించిన తాజా చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం  మాధ‌వ‌న్, అంజ‌లి, శాలిని పాండే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా వ‌ల్ల రిల‌జ్‌ను వాయిదా వేశారు. థియేట‌ర్స్ తెరిచే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.