ప్రభాస్ మాయలో పడిన అనుష్క


 Anushka Shetty accepts love on Prabhas
Anushka Shetty accepts love on Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాయలో పడిపోయింది సాలిడ్ అందాల భామ అనుష్క . ప్రభాస్ – అనుష్క లు కలిసి నాలుగు చిత్రాల్లో నటించారు . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో నటించడంతో ఈ జంట చూడముచ్చటగా ఉందని ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు . ఇక ఈ ఇద్దరి ఆమధ్య అంతకుమించి ఏదో ఉందని ఎప్పటి నుండో గుసగుసలు వినిపిస్తూనే ఉన్న విషయం తెలిసిందే .

తాజాగా అనుష్క సాహో టీజర్ తో మరోసారి ప్రభాస్ మాయలో పడింది . సాహో టీజర్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసి ప్రభాస్ పై తన ప్రేమని వ్యక్తం చేసింది . సాహో చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . అనుష్క ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు అలాగే ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోలేదు దాంతో ఈ ఇద్దరి పై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి . కానీ వీళ్ళు మాత్రం అబ్బే ! మా మధ్య అలాంటిదేమి లేదని అంటున్నారు ఏంటో .