స్వీటీ బర్త్ డే గిఫ్ట్  – నిశ్శబ్ధం టీజర్ రీలీజ్


Anushka Shetty birthday special - Nishabdham movie teaser released
Anushka Shetty birthday special – Nishabdham movie teaser released

అందరిని సృష్టించేటప్పుడు  ఎలా చేస్తాడో తెలియదుగానీ అనుష్క  నీ తయారు చేసేటప్పుడు మాత్రం బ్రహ్మదేవుడు  కచ్చితంగా ఓవర్ టైం  పని చేసి ఉంటాడు.  ఇది కేవలం అందం విషయంలో చెప్పడంలేదు. అనుష్క ని చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది.

కొద్దిగా గ్యాప్ తీసుకున్న స్వీటీ నిశ్శబ్దం అనే సినిమాతో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.  ఈ సినిమా టీజర్ ను  అనుష్క బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేశారు.

ఈ సినిమాలో అనుష్క తో పాటు సీనియర్ హీరో మాధవన్,  కోన వెంకట్ పర్మినెంట్ హీరోయిన్ అంజలి,  శాలిని పాండే,అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నారు.  హేమంత్ మధుకర్ ఈ సినిమాను డైరెక్షన్ చేస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్  బ్యానర్లపై T.G  విశ్వప్రసాద్ రచయిత కోన వెంకట్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఏ సినిమానైనా తన మ్యూజిక్ తో  next లెవల్ కి  తీసుకెళ్లే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్  ఈ సినిమాకి పని చేస్తున్నారు.

సినిమా టీజర్ ని బట్టి గమనిస్తే ఒక  భార్యాభర్తలు వెకేషన్ కి ఒకచోటికి వెళ్ళటం, ఇక్కడ ఆత్మలు వాళ్ళను ఇబ్బంది పెట్టడం, హత్య లు జరగడం ఇలా కథ  కొంచెం రొటీన్ గా ఉన్నా,  స్క్రీన్ ప్లే మరియు చిత్రీకరణ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.

ఏది ఏమైనా ఒక విషయం మాత్రం నిజం.

గ్లామర్ కు  అతీతంగా చాలా మంది హీరోయిన్లు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు.  వాళ్ళలో మన స్వీటీ కూడా ఒకటి.

 మరొక్కసారి మన స్వీటీకి హ్యాపీ బర్త్ డే.